Breaking News

నాగార్జునకు ఊహించని ఎదురుదెబ్బ.. కేంద్రం సీరియస్

అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగ్ ఫ్యామిలీకి చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎఫ్ సీ ఆర్ ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వార్షిక ఆదాయ వివరాలను సమర్పించకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2010-11 నుంచి 2015-16 వరకు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆదాయ వివరాలను అందించలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో తెలిపారు.  ఎఫ్ సీ ఆర్ ఏ అనుమతి కోల్పోయిన ఏ స్వచ్ఛంద సేవా సంస్థ కూడా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించడం సాధ్యం కాదు. తెలంగాణలో 190, ఏపీలో 450 సంస్థలకు ఎఫ్ సీ ఆర్ ఏ రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. కాగా, అక్కినేని ఫౌండేషన్ జాతీయ అవార్డుల ప్రదానం తోపాటు అనేక వైద్య శిబిరాల నిర్వహణతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

Gallery