Breaking News

అగ్ని-5 ప్రయోగం సక్సెస్… ఆందోళనలో చైనా

http://serezin-du-rhone.fr/pifpaxys/8537 ఇప్పటివరకు చైనా క్షిపణుల రేంజ్ ను అందుకునే క్షిపణి కోసం ఎదురుచూసిన భారత్ కు అగ్ని-5 ఓ దీటైన అస్త్రంలా కనిపిస్తోంది. లేటెస్ట్ గా జరిపిన ప్రయోగంలో అగ్ని-5 విజయవంతం కావడం భారత వర్గాలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. గురువారం ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి దాదాపు ఆసియా ఖండంతో పాటు యూరప్ ఖండంలోని 70 శాతం భూభాగాన్ని తన రేంజ్ లోకి తెచ్చుకుంది. వాస్తవానికి భారత్ ఈ క్షిపణి పరిధి 5000 కిలోమీటర్లు మాత్రమేనని చెబుతున్నా, చైనా మాత్రం అగ్ని-5 రేంజ్ 8000 కిలోమీటర్లు ఉంటుందని బలంగా నమ్ముతోంది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వస్తాయన్న కారణంగా భారత్ ఈ విషయాన్ని దాచిపెట్టి రేంజ్ ను తక్కువగా చెబుతోందని చైనా వర్గాలు భావిస్తున్నాయి.

Gallery