Breaking News

అజ్ఞాతవాసి ట్రైలర్ లేటుగా వచ్చినా పవర్ లో తేడా లేదు.. దంచుడే

source url పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అజ్ఞాతవాసి థియేట్రికల్ ట్రైలర్ గత అర్థరాత్రి విడుదల చేశారు. అయినాగానీ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో నిరూపించేలా కొద్ది గంటల్లోనే ఆరు లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో విధ్వంసం సృష్టిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీపై అంచనాలు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పవన్ తనదైన స్టయిల్లో హీరోయిజం పండించగా, డైలాగులు ఎంత పదునుగా ఉన్నాయో చూస్తే త్రివిక్రమ్ మల్టీ డైమన్షన్ టాలెంట్ ఈజీగా అర్థమవుతుంది. మొత్తమ్మీద పవన్ ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ ఓ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు.

Gallery