Breaking News

న్యూజిలాండ్ లో అండర్-19 వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం

న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న అండర్-19 వరల్డ్ కప్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐసీసీ నిర్వహించే ఈ మెగా ఈవెంట్ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ మౌంట్ మాంగనూయిలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఇక, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో రాటుదేలిన భారత్ జట్టు కూడా టైటిల్ పై ఎన్నో ఆశలతో బరిలో దిగుతోంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, కెన్యా, నమీబియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, పాపువా న్యూగినియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. గ్రూప్ బి లో ఉన్న భారత కుర్రాళ్ల జట్టు తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. బి గ్రూప్ లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, జింబాబ్వే, పాపువా న్యూగినియా జట్లున్నాయి.

Gallery