Breaking News

అనుష్కకు ఇవన్నీ ఓ లెక్కా..!: అల్లు అరవింద్

టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. అశోక్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అనుష్క మరోసారి డైనమిక్ రోల్ పోషించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, అనుష్కకు చాలా ఓపిక ఉందని, ఇండస్ట్రీలో మరెవరికీ అంతటి ఓపిక ఉందంటే తాను నమ్మలేనని అన్నారు. తనలో ఎంత ఓపిక ఉందో అనుష్క అరుంధతి సినిమా టైమ్ లోనే ప్రూవ్ చేసుకుందని, అరుంధతిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇవన్నీ ఓ లెక్కా అంటూ వ్యాఖ్యానించారు. భాగమతి సినిమా ద్వారా ఆమెకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Gallery