రూమర్లకు సింగిల్ వీడియోతో చెక్ పెట్టిన యాంకర్ ప్రదీప్డ్రంక్ అండ్ డ్రైవ్ ఉదంతంలో అప్రదిష్ఠపాలైన ప్రముఖ యాంకర్ ప్రదీప్ అజ్ఞాతం వీడి బయటికి వచ్చారు. తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ రకరకాలుగా ఊహాగానాలు రావడంపై ఆయన మనస్తాపం చెందారు. అందుకే తన తాజా సమాచారంతో ఓ వీడియో విడుదల చేశారు. తాను తప్పుచేసిన మాట నిజమేనని, అయితే తనలా మరెవరూ తప్పు చేయవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తనపై అనేక విధాలుగా కథనాలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. దయచేసి దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. తన టీవీ షో షూటింగ్ లతో బిజీగా ఉన్నానని, అవి ఎప్పుడో అంగీకరించినవి కావడంతో తప్పనిసరిగా వాటికి హాజరవ్వాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు ప్రదీప్. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ కు హాజరవుతానని స్పష్టం చేశారు.

Gallery