Breaking News

గజల్ కు ఫేవర్ గా మాట్లాడి ఇప్పుడు సిగ్గుపడుతున్న మంత్రి

follow కొత్త సంవత్సరం ఆరంభంలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల వ్యవహారం. తన కార్యాలయంలో పనిచేసే యువతిని లైంగిక వాంఛలు తీర్చాలంటూ వేధిస్తున్న గజల్ శ్రీనివాస్ ఇప్పుడు కటకటాల వెనక్కిచేరాడు. అయితే, గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వార్త విన్న వెంటనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. గజల్ శ్రీనివాస్ కు ఏ తప్పు తెలియదు, అమాయకుడు అన్న కోణంలో మాట్లాడారు. గజల్ తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడని, ఇందులో ఏదో కుట్ర ఉండే అవకాశం ఉందని కామెంట్ చేశారు. కానీ, బాధితురాలు ఎప్పుడైతే మరిన్ని వీడియోలు బయటపెట్టిందో మాణిక్యాలరావు తాను పొరబడినట్టు గ్రహించారు. వెంటనే తన నిజాయతీని చాటుకున్నారు.

opzioni binarie con 50 euro di versamento గజల్ శ్రీనివాస్ విషయంలో తాను ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, అలా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఆ వీడియోలు చూసిన తర్వాత గజల్ శ్రీనివాస్ లోని మరో కోణం బయటపడిందని, ఇలాంటి వ్యక్తిని అసలు ఊహించలేకపోయానని తెలిపారు. ఇన్నాళ్లు గజల్ శ్రీనివాస్ లో నాణానికి ఒకవైపే చూశానని, ఇప్పుడు మరోవైపు కూడా స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత అతడిని సమర్థించడం ఎంత పాపమో అర్థమవుతోందని అన్నారు.

Gallery