తమిళ ప్రజలపై ఏఆర్ రెహమాన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమిళ ప్రజలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్వరలో కచేరీ ఇవ్వనున్నారు. తన సొంత నగరం చెన్నయ్ లో సంగీత ప్రదర్శన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని, తమిళనాడు ప్రజలంటే తనకు ఎప్పుడూ స్పెషల్ అని అన్నారు. తన పాతికేళ్ల ప్రస్థానంలో తమిళ ప్రజల కోసం పూర్తిస్థాయిలో కచేరీ ఇస్తుండడం ఆనందంగా ఉందని రెహమాన్ తెలిపారు. గత పాతికేళ్లుగా నమ్మలేని విధంగా కాలం గడిచిపోయిందని, ఇంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకోగలగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

Gallery