Breaking News

సచిన్ తనయుడిని ఆకాశానికెత్తేసిన ఆస్ట్రేలియా మీడియా

get link భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఆస్ట్రేలియా మీడియా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. ప్రస్తుతం అర్జున్ ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ సీజీ) ఆధ్వర్యంలో జరుగుతున్న గ్లోబల్ టి20 టోర్నీలో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్ లో 4 ఓవర్లలో 4 వికెట్లు సాధించడమే కాదు, బ్యాటింగ్ లోనూ విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అర్జున్ వీరోచిత ప్రదర్శనపై ఆసీస్ పత్రికలు, చానళ్లు ప్రత్యేకంగా కథనాలు రూపొందించాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ… తనకు పేస్ బౌలింగ్ అంటే ఇష్టమని, మిచెల్ స్టార్క్, బెన్ స్టోక్స్ తన అభిమాన ఆటగాళ్లని చెప్పాడు.

Gallery