Breaking News

ఐపీఎల్ వేలంలో బెన్ స్టోక్స్ టాపర్

cialis 100mg cheap price ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ తాజా వేలంలో రూ.12.50 కోట్లతో టాపర్ గా నిలిచాడు. శనివారం జరిగిన వేలంలో ఈ స్టార్ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే, కిందటేడాదితో పోలిస్తే స్టోక్స్ ధర కాస్త తగ్గింది. 2017లో స్టోక్స్ రూ.14 కోట్ల ధర పలికి సంచలనం సృష్టించాడు. ఇక, కర్ణాటక బ్యాట్స్ మన్ మనీష్ పాండే రూ.11 కోట్ల ధరతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంచి ఫామ్ లో ఉన్న ఈ యువ ఆటగాడిని ఎంతో ఆచితూచి ఖర్చు పెట్టే హైదరాబాద్ సన్ రైజర్స్ అంత ఖర్చు పెట్టి కొనడమే వేలం తొలిరోజు హైలెట్ గా నిలిచింది. ఇక, టీమిండియా టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా రూ.11 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అమ్ముడయ్యాడు. ముఖ్యంగా, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ను రూ.9 కోట్ల రూపాయలతో సన్ రైజర్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా అట్టిపెట్టుకుంది.

Gallery