Breaking News

సింధుకు కోహ్లీకి ముడిపెడుతున్న బేడీ, ఎలా కుదురుతుంది?

మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును అందుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. సింధు ఇంటర్నేషనల్ లెవల్లో బెస్ట్ ప్లేయర్స్ తో పోటీ నెగ్గిందని, క్రికెట్ లో కోహ్లీ విషయానికొస్తే మంచి బౌలర్లను ఎదుర్కొనడానికి అసౌకర్యంగా ఫీలవుతున్నాడని అభిప్రాయపడ్డారు.

చాలా సంవత్సరాలుగా పీవీ సింధు అద్భుత విజయాలు సాధించిందని, ఆమెతో పోల్చితే కోహ్లీ సాధించింది చాలా తక్కువని చెప్పడానికి తానేమీ వెనుకాడబోనని అన్నారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ భారత జట్టు సామర్థ్యానికి నిజమైన సవాల్ అని ఆయన అభివర్ణించారు. స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్ ను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఆ పత్రిక ఆవిష్కరణోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Gallery