Breaking News

క్రికెటర్లతో ఆడుకుంటున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎయిర్ లైన్స్ సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఈ మధ్య తరచుగా వార్తల్లో కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ భార్యాబిడ్డలను సరైన పత్రాలు లేవంటూ దుబాయ్ లో ఆపేసిన ఎమిరేట్స్ వర్గాలు, తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కు షాకిచ్చాయి.
ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ ఆడుతూ యాషెస సిరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న పీటర్సన్, క్రిస్మస్ వేడుకల కోసం స్వదేశానికి వెళ్లి తిరిగి ఆస్ట్రేలియా చేరుకునేందుకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కాడు. అయితే యూకే నుంచి దుబాయ్ మీదుగా మెల్ బోర్న్ చేరుకున్న పీటర్సన్ తన లగేజి మిస్సయిన విషయం గుర్తించాడు.
కామెంట్రీ చెప్పే సమయంలో ధరించాల్సిన దుస్తులు అందులోనే ఉండిపోవడంతో పీటర్సన్ నిరుత్సాహానికి గురయ్యాడు. దాంతో ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తి వెళ్లగక్కాడు. కేపీ బాధను అర్థం చేసుకున్న ఎమిరేట్స్ యాజమాన్యం తమ క్రెడిట్ కార్డును అందజేసి దుస్తులు కొనుక్కునే వీలు కల్పించింది.

Gallery