Breaking News

మద్యం మత్తులో పోలీసులకు దొరికిపోయిన యాంకర్ ప్రదీప్

http://lokoli.com/?rtyt=premi%C3%A8re-rencontre-apr%C3%A8s-rupture&53d=c1 ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ లో గతరాత్రి నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ పట్టుబడడం అందరినీ షాక్ కు గురిచేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ప్రదీప్ కారును ఆపిన పోలీసులు అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించి షాక్ తిన్నారు. మామూలుగా 35 పాయింట్లు నమోదైనా కేసు రిజిస్టర్ చేస్తారు. అలాంటిది ఏకంగా ప్రదీప్ కు 178 పాయింట్లు నమోదవడం పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. హెవీగా డ్రింక్ చేస్తేనే బ్రీత్ అనలైజర్ అన్ని పాయింట్లు చూపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. దాంతో, ప్రదీప్ కు జైలుశిక్ష తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ కారును స్వాధీనం చేసుకున్నారు.

Gallery