పవన్, పూనమ్ కౌర్.. మీ బండారం బయటపెడతా: కత్తి సవాల్

దమ్ముంటే నాతో చర్చకు రండి.. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ లో...

పవన్ కల్యాణ్, ఆయన అభిమానులపై కత్తి మహేష్ సాగిస్తున్న పోరాటం తీవ్రరూపం దాల్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు పవర్ స్టార్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో కత్తులు దూసిన ఈ రివ్యూ రైటర్ తన యుద్ధ రంగాన్ని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ కు మార్చాడు. పవన్ కల్యాణ్ కు, ఆయనకు మద్దతిస్తున్న పూనమ్ కౌర్ కు దమ్ముంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరాడు. మీరో నేనే తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్ చాలెంజ్.. మీ బండారం నేను బయటపెడతా… వస్తారా? అంటూ కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ చేశాడు.

Gallery