అనుష్క సహా దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ

టీమిండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఇప్పటిదాకా సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సుదీర్ఘమైన క్రికెట్ ఆడేందుకు సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు శుక్రవారం ఉదయం కేప్ టౌన్ చేరుకుంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు అతడి అర్థాంగి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కూడా దక్షిణాఫ్రికా చేరుకుంది. కాగా, ఈ టూర్ లో టీమిండియా సఫారీలతో 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టి20 మ్యాచ్ లు ఆడుతుంది.

Gallery

Leave a comment

Your email address will not be published.