Breaking News

ప్రభాస్ తో సినిమాకు డైరక్టర్ ను అనౌన్స్ చేసిన కృష్ణంరాజు

http://freejobseeker.com/?q=price-viagra సీనియర్ నటుడు కృష్ణంరాజు త్వరలోనే నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన ఎన్నో మరపురాని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంపై ఓ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన అభిమానుల మధ్య ఈ ఐదు దశాబ్దాల వేడుక నిర్వహిస్తానని తెలిపారు. అంతేకాదు, ఏప్రిల్ లో ప్రభాస్ హీరోగా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తామని, ఈ సినిమాకు రాధాకృష్ణ డైరక్షన్ బాధ్యతలు చేపడతాడని ప్రకటించారు. తమ గోపీకృష్ణ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తామని వెల్లడించారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి చెబుతూ అప్పట్లో బాహుబలి తర్వాత చేసుకుంటానని చెప్పాడని, ఇప్పుడు సాహో తర్వాత అంటున్నాడని, పెళ్లెప్పుడు చేసుకుంటాడో ప్రభాస్ కే తెలియాలని కృష్ణంరాజు అన్నారు.

Gallery