Breaking News

లార్గో వించ్ దర్శకుడు ఇతనే… అజ్ఞాతవాసి చూస్తాడట!

http://caboclonharaue.com/?kreosan=op%C3%A7%C3%B5es-binarias-gratis&a83=f5 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ కాపీరైట్ ఇష్యూలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు కాపీ అని ప్రచారం జరుగుతోంది. లార్గో వించ్ సినిమా ఆలిండియా రైట్స్ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టి-సిరీస్ వద్ద ఉండడంతో ఆ సంస్థ లీగల్ గా అప్రోచ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు నేషనల్ మీడియా చెబుతోంది. అయితే, లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

follow link ఇండియా నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆయన దృష్టికి కూడా వెళ్లినట్టు అర్థమవుతోంది. దాంతో ఆయన ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు. అజ్ఞాతవాసి మూవీ చూసేందుకు ఆగలేకపోతున్నానని ట్వీట్ చేశారు. వెంటనే టికెట్ బుక్ చేసుకుంటానని, సినిమా టికెట్ కంటే ముందు ప్లేన్ టికెట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. దాంతో ఆయన ఇండియా వస్తున్నాడన్న విషయం అర్థమవుతోంది. ఆయనే గనుక అజ్ఞాతవాసి మూవీ చూసి ఇది తన సినిమాకు కాపీయే అని కన్ఫామ్ చేస్తే పవన్, త్రివిక్రమ్ లకు తిప్పలు తప్పవు.

best songs to hook up to

Gallery