Breaking News

కోడిపందేల కత్తితో జగన్ పై దాడి… తప్పిన పెనుప్రమాదం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై అనూహ్యరీతిలో దాడి జరిగింది. జగన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు రాగా అక్కడ ఆయనపై కత్తితో ఓ యువకుడు దాడి చేశాడు. జగన్ విమానం కోసం ఎదురుచూస్తూ పాసెంజర్స్ లాంజ్ లో కూర్చుని ఉండగా, శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫీ కోసం వచ్చి ఒక్కసారిగా జగన్ పై దాడికి దిగాడు. కోడిపందేలలో కోడిపుంజు కాలికి కట్టే ఎంతో పదునైన కత్తితో జగన్ ను గాయపరిచేందుకు ప్రయత్నించాడు. జగన్ వెంటనే అలర్ట్ కావడంతో కత్తిపోట్లు తప్పాయి. అంతలో అక్కడే ఉన్న జగన్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని పోలీసులకు హ్యాండోవర్ చేశారు. శ్రీనివాస్ ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పనిచేసే వెయిటర్ గా గుర్తించారు. జగన్ పై దాడి జరిగిందన్న సమాచారం మీడియాలో ప్రముఖంగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. జగన్ కు ఏమైంది అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే జగన్ కు పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న అనంతరం జగన్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు. 

Gallery