కొరియన్ కుర్రాడి చేతిలో జకోవిచ్ అనూహ్య ఓటమి | Veguchukka
Breaking News

కొరియన్ కుర్రాడి చేతిలో జకోవిచ్ అనూహ్య ఓటమి

http://winevault.ca/?perex=robot-gratuiti-opzioni-binarie ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ గా భావిస్తున్న మాజీ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ పై 21 ఏళ్ల కొరియన్ కుర్రాడు హియాన్ చంగ్ సంచలన విజయం నమోదుచేశాడు. ప్రపంచస్థాయిలో 58వ స్థానంలో ఉన్న హియాన్ చంగ్ 7-6, 7-5, 7-6తో వరుస సెట్లలో జకోవిచ్ ఆటకట్టించడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన చంగ్ అభిమాన ఆటగాడు జకోవిచ్చే. అయినా, ప్రత్యర్థిగా బరిలో దిగి విజయం సాధించడంలో పూర్తిగా ప్రొఫెషనలిజం చూపించాడీ ఆసియన్ క్రీడాకారుడు.

Gallery