Breaking News

అరవింద సమేత టైటిల్ వెనుక అసలు కథ చెప్పిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ రాయలసీమ ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయిక. అసలీ చిత్రం పేరు అరవింద సమేత వీర రాఘవ. ఇందులో వీర రాఘవ అనేది ట్యాగ్ లైన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా దసరా ముందు అక్టోబరు 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ను వివరించాడు.

“నిజంగా ఇది వండ్రఫుల్ టైటిల్. అసలు ప్రతి మగాడికి స్త్రీ ఓ ఆయుధం లాంటిది. మనం దేవుళ్లను ఎలా పిలుస్తామంటే లక్ష్మీసమేత నరసింహ స్వామి, సీతా సమేత శ్రీరాముడు… ఇలాపిలుచుకుంంటాం. అందుకే మా సినిమాలో కూడా స్త్రీ ఇంపార్టెన్స్ ఏంటో చూపించేలా అరవింద సమేత వీరరాఘవ అని పెట్టాం. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ ఎందుకు కరెక్టో అర్థమవుతుంది.. ఇక త్రివిక్రమ్ సర్, నా కాంబినేషన్ లో ఎలాంటి సినిమా పడాలో సరిగ్గా అలాంటి సినిమానే పడింది. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కథ మా ఇద్దరి కోసమే పుట్టిందా అన్నట్టుంది..” అంటూ ఎన్టీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Gallery