Breaking News

కుమార్తెను ఒళ్లో కూర్చోబెట్టుకుని న్యూస్ చదివిన పాకిస్తానీ యాంకర్

source site పాకిస్థాన్ లో మానవహక్కుల విషయంలో ప్రజల్లో తీవ్రస్థాయిలో చైతన్యం కనిపిస్తోంది. ఇటీవల 8 ఏళ్ల వయసున్న జైనాబ్ అనే బాలికపై దారుణంగా అత్యాచారం జరిపిన కిరాతకులు ఆమెను హత్యచేయడం సంచలనం సృష్టించింది. ఈ హేయమైన ఘటనకు నిరసనగా సమా టీవీ చానల్ యాంకర్ కిరణ్ నాజ్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. తన చిన్నారి కుమార్తెను ఒడిలో కూర్చోబెట్టుకుని న్యూస్ చదివింది. తాను ఒక తల్లినే అని, తన కుమార్తె భద్రత తనకు ముఖ్యమని అందుకే ఒళ్లో కూర్చోబెట్టుకుని వార్తలు చదివానని తెలిపింది. జనవరి 4న కిడ్నాప్ కు గురైన జైనాబ్ అత్యాచారానికి గురైందని తర్వాత తెలుసుకున్నారు. అప్పటికే ఆ బాలిక ఓ చెత్తకుప్పలో శవమై పడివున్న స్థితిలో గుర్తించారు. జైనాబ్ తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో ఉంటున్నారు.

Gallery