పవన్ కల్యాణ్ తో శభాష్ అనిపించుకున్నాడు… ఎవరీ బుజ్జి!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరరావు అనే పాట ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ స్వయంగా ఆలపించిన ఈ గీతం ఆన్ లైన్ లో విడుదలైందో లేదో లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. అయితే, లండన్ లో ఉంటూ తెలుగు పాటలు ఆలపించి యూట్యూబ్ లో పెట్టే పోలెండ్ బాలుడు జిబిగ్న్యూ ఇప్పుడు కొడకా కోటేశ్వరరావు పాట పాటి పవన్ కు కానుకగా పంపించాడు. హేయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… కొడకా కోటేశ్వరరావు పాటను ఎంత చక్కగా పాడారు… ఇప్పుడు నా స్టయిల్ లో నేను పాట పడి మీకు గిఫ్ట్ గా పంపిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మైడియర్ లిటిల్ ఫ్రెండ్… నీ కానుక అందింది… మెనీ మెనీ థ్యాంక్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ అంటూ పోలెండ్ బాలుడికి తన ఆశీస్సులు అందజేశారు. ట్విట్టర్ లో అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తున్న పోలిష్ బాలుడు జిబిగ్న్యూ ముద్దుపేరు బుజ్జి. అతని ట్విట్టర్ హ్యాండిల్ గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది.

Gallery