కొత్త సంవత్సరం రోజున పవన్ కొత్త రాజకీయాలు | Veguchukka
Breaking News

కొత్త సంవత్సరం రోజున పవన్ కొత్త రాజకీయాలు

go site జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కొత్త సంవత్సరం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన పవన్ అనేక విషయాలపై చర్చించారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ సర్కారు రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అద్భుతం నమోదు చేసిందని పవన్ కేసీఆర్ ను ప్రశంసించారు. తెలంగాణలో పథకాలు అమలవుతున్న తీరును ఏపీ నాయకులు కూడా గమనించాలని అన్నారు.

go to link రైతులకు సముచిత న్యాయం చేశారని పవన్ వ్యాఖ్యానించగా, తాను రైతు బిడ్డనని, రైతు కుటుంబాల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయో తనకు తెలుసని కేసీఆర్ బదులిచ్చారు. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఉచిత్ విద్యుత్ అసాధ్యమని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, కానీ, సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని తెలిపారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పై తన పంథా ఎప్పటికీ మారదని, ఆ పార్టీపై గౌరవం ఉందని అన్నారు.

Gallery