కొండగట్టు నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర | Veguchukka
Breaking News

కొండగట్టు నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర

source site జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలోనే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగే ఈ యాత్రలో ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తానని, వాటిని అవగాహన చేసుకునేందుకు వస్తున్న తనను దీవించాలని పవన్ కోరారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 2009 ఎన్నికల సమయంలో జరిగిన పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే సురక్షితంగా బయటపడిన కారణంగానే కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభిస్తున్నట్టు పవన్ వివరించారు. పైగా హనుమంతుడు తమ కుటుంబ ఇలవేల్పు అని చెప్పారు. త్వరలోనే తన రాజకీయ యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కొండగట్టులోనే ప్రకటిస్తానని తెలిపారు.

follow link

Gallery