Breaking News

సొంత పార్టీ నేతలపై ప్రధాని మోడీ అసంతృప్తి.. ఎందుకో తెలుసా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ తనలాగే పంక్చువల్ గా ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఆయన ఉదయాన్నే నరేంద్ర మోడీ యాప్ ద్వారా బీజేపీ లీడర్లందరికీ గుడ్ మార్నింగ్ సందేశం పంపిస్తారు. అయితే కొంతమంది ఎంపీలు తప్ప మిగతావాళ్లందరూ ప్రధాని విష్ ను లైట్ తీసుకుని వదిలేస్తున్నారట. తిరిగి రిప్లయ్ పంపాలని కూడా తెలియకపోతే ఎలా అంటూ మోడీ తన సహచరులపై తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ యాప్ ముఖ్యోద్దేశం పార్టీలో అంతర్గత సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, నేతల మధ్య సంబంధాలు బలపరుచుకోవడానికి అని తెలిపారు.

Gallery