Breaking News

జగన్ పై హత్యాయత్నం చేసింది ఈ కుర్రాడే

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. విమానాశ్రయంలోని క్యాంటీన్ లో వెయిటర్ గా పనిచేసే శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో జగన్ పై దాడికి దిగినట్టు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావుది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం అని వెల్లడించారు. విపక్ష నేత జగన్ పై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చినరాజప్ప ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చాడని, ఆపై కత్తితో దాడికి పాల్పడ్డాడని హోంమంత్రి వివరించారు. ప్రస్తుతం ఆ వెయిటర్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అసలు విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చిందో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు.

Gallery