Breaking News

దీక్ష పేరుతో పవన్ ను చంపడానికి ప్లాన్ చేశారా… పోసాని ఫైర్

go to link సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సానుభూతి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ ను చంపడానికి ప్రణాళికలు రచించారా అంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. పవన్ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, సీఎం కాదు.. మరి ఆయన్ను ఎంకరేజ్ చేసి దీక్షకు కూర్చోబెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్లే దీక్షకు కూర్చోవాలని, పవన్ దీక్షకు దిగడాన్ని తాను కోరుకోవడం లేదని అన్నారు. ఒకవేళ పవన్ దీక్ష చేస్తానంటే తాను మద్దతిస్తానని పోసాని పేర్కొన్నారు.

http://tjez.gob.mx/perdakosis/5985 జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబుతో మిత్ర పక్షంగా ఉంటే తనకు అన్ని పనులు సులభంగా జరిగిపోతాయని తెలిసి కూడా పవన్ భారీ బహిరంగ సభలో ఆరోపణలు చేశాడంటే వాటిలో నిజం ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని టీడీపీ నాయకులు భావిస్తే ఆధారాలు చూపించమని అడగొచ్చు కదా అన్నారు పోసాని.

Gallery