Breaking News

ఫ్యాన్స్ విలన్ అని రెచ్చిపోతే ఫ్రభాస్ ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు!

go here వాస్తవానికి, గాసిప్ కి ఎంత తేడా ఉంటుందో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాస్ లేటెస్ట్ గా ఓ ఫేమస్ మాగజైన్ జీక్యూ ఇండియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తనకు బాలీవుడ్ టాప్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ మంచి స్నేహితుడని తెలిపాడు. తనకు ఏం కావాలన్నా అతడిని అడిగితే ఇట్టే సమకూరుస్తాడని ఎంతో గొప్పగా చెప్పాడు. బాహుబలి రిలీజ్ టైమ్ లో కరణ్ జోహార్ సాయం మరువలేనిదని అన్నాడు.

http://vitm.com/index.php?format=feed అయితే, ఇదే కరణ్ జోహార్ గతంలో సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ప్రభాస్ ను ఉద్దేశించి చేశాడని అప్పట్లో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభాస్ ఇమేజ్ ను సొమ్ముచేసుకుని హిందీ బాహుబలితో లాభాలు గడించిన కరణ్ ప్రభాస్ ను తన ట్వీట్ ద్వారా అవమానించాడన్నది ఫ్యాన్స్ ఆరోపణ. అయితే ప్రభాస్ మాత్రం దేన్నీ సీరియస్ గా తీసుకోకుండా పక్కా ప్రొఫెషనల్ గా ముందుకెళ్లడం నిజంగా అభినందనీయం.

Gallery