Breaking News

కృష్ణంరాజు అప్పటివరకు ప్రభాస్ ను వదలడా..!

go hereయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. బాహుబలి ద కంక్లూజన్ తర్వాత ప్రభాస్ ఓ బాలీవుడ్ చిత్రం చేస్తాడని ప్రచారం జరిగినా, యూవీ క్రియేషన్స్ తో కమిటైన మూవీకే ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు. సుజీత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆ మూవీ ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

best dating app barcelona రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన ప్రొడక్షన్ హౌస్ గోపీకృష్ణ బ్యానర్ దందా అనే టైటిల్ ను ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించింది. ఈ టైటిల్ ప్రభాస్ కోసమే అని సమాచారం. ప్రభాస్ తో ఇంతకుముందు కృష్ణంరాజు బిల్లా సినిమా తీశారు. దాని తర్వాత తన ఎపిక్ మూవీ భక్త కన్నప్పను ప్రభాస్ తో రీమేక్ చెయ్యాలని ప్రయత్నించినా అది పట్టాలెక్కలేదు. దాంతో ఆ ప్రాజక్టు పక్కనపెట్టి పక్కా కమర్షియల్ మూవీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దందా టైటిల్ దాని కోసమేనని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి.

follow link ఈ సినిమాకు కృష్ణంరాజు డైరక్షన్ చేస్తాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ, ప్రభాస్ కు తన బ్యానర్ లో ఎలాగైనా హిట్టవ్వాలని కృష్ణంరాజు పట్టుదలగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. బిల్లా సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో దందాతో ప్రభాస్ ను శాటిస్ఫై చేయాలని కృష్ణంరాజు కోరుకుంటున్నాడట.

Gallery