ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు పాత్రలో హీరో రాజశేఖర్! | Veguchukka
Breaking News

ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు పాత్రలో హీరో రాజశేఖర్!

మహానటుడు, తెలుగుజాతి గర్వించదగ్గ రాజకీయనేత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలకవ్యక్తిగా ఉన్న చంద్రబాబు పాత్రకు హీరో రాజశేఖర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీలో రాజశేఖర్ కనిపించడం ఖాయమే అయినా, ఆయనకు ఏ పాత్ర అన్నదానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కు కూడా రాజశేఖర్ హాజరయ్యారు. దాంతో ఆయనకు ఈ సినిమాలో ఓ పాత్ర ఉంటుందన్న విషయం చర్చనీయాంశం అయింది. రాజశేఖర్ కు చంద్రబాబు పాత్ర విషయమై బాలీవుడ్ నిపుణులతో మేకప్ టెస్ట్ చేయించిన తర్వాత బాలకృష్ణ, దర్శకుడు తేజ ఫైనలైజ్ చేస్తారని సమాచారం.

Gallery