నడవలేని స్థితిలో దిగ్గజ క్రికెటర్.. ఆందోళనలో ఫ్యాన్స్

ఒకప్పుడు వన్డే క్రికెట్ లో తొలి పదిహేను ఓవర్లలో పరుగులు తీయడానికి ఇబ్బందిపడేవాళ్లు. అలాంటిది పవర్ ప్లే ముగిసేసరికి బౌలర్లందరినీ ఓ రౌండు చితకబాదడం మొదలుపెట్టింది శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య. అతడు చూపిన బాటలో ఇప్పుడు ప్రపంచ మేటి ఓపెనర్లు విరుచుకుపడి పరుగులు సాధిస్తున్నారు. అలాంటి ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో క్రచస్  లేనిదే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడట.

సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన జయసూర్య అప్పటి గాయాలు తిరగబెట్టడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. త్వరలో మెల్ బోర్న్ వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకోవాలనుకుంటున్న జయసూర్య ప్రస్తుతం అందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. శ్రీలంక క్రికెట్ లో అత్యంత విజయవంతమైన ప్లేయర్ గా జయసూర్యకి పేరుంది. అప్పుడప్పుడు బౌలింగ్ తో కూడా తన జట్టును ఆదుకునే ఈ లెఫ్ట్ హ్యాండర్ వరల్డ్ కప్ గెలిచిన లంక జట్టులో సభ్యుడు.

Gallery