Breaking News

పద్మావత్ ను అడ్డుకోవద్దు… నాలుగు రాష్ట్రాల నిర్ణయంపై సుప్రీం కోర్టు

see సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్ చిత్రం విడుదలకు మార్గం సుగగమైంది. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ నటించిన ఈ సినిమా విడుదలపై ఏ రాష్ట్రం కూడా నిషేధం విధించరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే ఆ సినిమాను నిషేధించిన నాలుగు రాష్ట్రాల తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా పద్మావత్ సినిమాను విడుదల చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది.

see url పద్మావత్ సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలు రిలీజ్ పై నిషేధం విధించాయి. దాంతో సినిమా నిర్మాతలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, గురువారం దీనిపై విచారణ జరిగింది. సుప్రీం కోర్టు పద్మావత్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 25న విడుదల అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే రాజ్ పుత్ కర్ణి సేన దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. చిత్ర యూనిట్ పై భౌతిక దాడులు కూడా జరిగాయి.

Gallery