Breaking News

నిప్పులు చెరిగిన షమీ… టీమిండియా గ్రాండ్ విక్టరీ

source link జొహాన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాట్స్ మెన్ పాలిట సింహస్వప్నంలా నిలిచిన ఈ బౌలింగ్ పిచ్ పై నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన 63 పరుగుల తేడాతో నెగ్గింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా, ఆత్మస్తయిర్యం కోల్పోకుండా గట్టి పట్టుదల కనబర్చిన భారత ఆటగాళ్లు ఆతిథ్య దక్షిణాఫ్రికాను చావుదెబ్బ కొట్టారు. 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు ఇండియా పేసర్ మహ్మద్ షమీ ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌటయ్యారు.

rencontre skype ado దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్ 86 పరుగులతో ఒంటరిపోరాటం చేసినా ప్రయోజనం దక్కలేదు. ఆమ్లా 52 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ రెండేసి వికెట్లతో రాణించారు. భువీకి ఒక వికెట్ లభించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ 1-2తో ముగించింది.

http://drybonesinthevalley.com/?tyiuds=apa-itu-pips-forex ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా భువనేశ్వర్ కుమార్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా వెర్నాన్ ఫిలాండర్ నిలిచారు. ఇరు జట్ల మధ్య 6 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానంలో జరగనుంది.

Gallery