మిథాలీ రాజ్ కు కోటి రూపాయల నజరానా అందించిన తెలంగాణ

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు అదిరిపోయే కానుక లభించింది. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ప్రపంచకప్ లో భారత్ ఫైనల్స్ కు చేరడంలో కీలకపాత్ర పోషించిన మిథాలీ రాజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు బహుమతిగా అందించింది. గురువారం సెక్రటేరియట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి పద్మారావు మిథాలీ రాజ్ కు చెక్ బహూకరించారు. అంతేకాదు, బంజరాహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు కూడా ఆమెకు అందించారు. ఇక, మిథాలీ క్రికెట్ గురువు మూర్తికి పాతిక లక్షలు నజరానాగా బహూకరించడం విశేషం.

Gallery

Leave a comment

Your email address will not be published.