Breaking News

నటుడు గుండు హనుమంతరావుకు తెలంగాణ సర్కారు సాయం

టాలీవుడ్ కమెడియన్ గుండు హనుమంతరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. హనుమంతరావు గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన దుస్థితికి చలించి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. తాజాగా, తెలంగాణ సర్కారు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి హనుమంతరావుకు నగదు విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు.
తెలుగులో వందల సంఖ్యలో సినిమాలు చేసిన గుండు హనుమంతరావు కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు వారానికి మూడు సార్లు డయాలసిస్ నిర్వహించాల్సి రావడంతో ఖర్చు అధికమవుతోంది. ఖర్చు భరించే స్తోమత లేని ఆయన ఇంటి వద్ద నుంచే చికిత్స పొందుతున్నారు.

Gallery