Breaking News

సుప్రీం కోర్టులో ముసలం.. చీఫ్ జస్టిస్ పై న్యాయమూర్తుల తిరుగుబాటు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సంక్షోభం ఏర్పడినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీం న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్ మీడియా ముందుకు వచ్చి సుప్రీం కోర్టులో పాలనాపరమైన లోపాలు తీవ్రస్థాయికి చేరాయన్న సంచలన విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో జరిగింది. లోపాలను చక్కదిద్దుకోవాలని తాము సీజేఐకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, అందుకే ఈ సమస్యను దేశం ముందు ఉంచుతున్నామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై తాము చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖను మీడియాకు అందిస్తామని అన్నారు.

Gallery