Breaking News

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించిన యువకుడు అరెస్ట్

http://web-impressions.net/fister/2159 భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానంటూ బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత డిసెంబరు లాస్ట్ వీక్ లో సచిన్ టెండూల్కర్ నివాసానికి ఫోన్ చేసిన యువకుడు సారాను ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుంటానని బెదిరించాడట. అయితే ఆ సమయంలో సారా ఇంట్లో లేదు. ఉన్నత విద్య కోసం ఫారెన్ వెళ్లినట్టు సమాచారం.

günstige binäry optionen ఈ విషయంలో సచిన్ పీఏ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పశ్చిమ బెంగాల్ కు చెందిన దేవ్ కుమార్ మిత్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే దేవ్ కుమార్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. సారాను తాను టీవీల్లో చాలా సార్లు చూశానని, తనకు నచ్చిందని అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నానని దేవ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.

Gallery