పవన్, కేసీఆర్ లపై విజయశాంతి విమర్శలు | Veguchukka
Breaking News

పవన్, కేసీఆర్ లపై విజయశాంతి విమర్శలు

here సినీ నటి, రాజకీయనాయకురాలు విజయశాంతి మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణ నుంచి రాజకీయ యాత్ర షురూ చేసిన పవన్ కల్యాణ్ పైనా, అందుకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. సకల జనుల సర్వే సందర్భంగా పవన్ ను ఓ టూరిస్టుతో పోల్చిన కేసీఆర్ తెలంగాణలో యాత్రకు ఇప్పుడెలా అనుమతి ఇచ్చారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే నిర్బంధ పరిస్థితులను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం శక్తికి మించి పోరాడిన కోదండరాం, ఇతర నేతలకు కూడా తెలంగాణలో తిరిగేందుకు కేసీఆర్ వీసాలిస్తే బాగుండేదని, కనీసం తాము తెలంగాణలో ఉన్నామన్న ఫీలింగైనా వారికి కలిగేదని విజయశాంతి సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ కు ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణ ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు.

Gallery